Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అలుగుటయే ఎరుగని చంద్రబాబు అలిగితే...: చిత్తూరు ఎంపీ శివప్రసాద్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అలగటమే తెలియని నేతని, ఆయన అలిగిన రోజు బీజేపీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుగుదేశం నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం పార్లమెంట్ ఎదుట మీడియాతో మాట్లాడిన ఆయన, బీజేపీ మిత్రపక్షంగా ఉండి కూడా ప్రత్యేక హోదా కోసం మళ్లీ పోరాటానికి దిగాల్సి రావడం దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. "మా నేత చంద్రబాబునాయుడు ఇంకా తలొగ్గి మాట్లాడుతున్నారంటే, ఆయన ధర్మరాజు లాంటివారు కాబట్టే. ఆయనకు అంత తొందరగా కోపంగానీ, ఆవేశంగానీ రావు. అలుగుటయే ఎరుగని ఆ అజాతశత్రువు చంద్రబాబునాయుడు అలిగిన రోజు ఎటువంటి పరిస్థితులు వస్తాయో బీజేపీ వారు అర్థం చేసుకోవాలి" అన్నారు.

More Telugu News